ఆలేరులో బీఆర్ఎస్ విజయం సాధించబోతుంది

– కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న గొంగిడి సునీత
నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్ : ఆలేరులో బీఆర్ఎస్ విజయం సాధించబోతుంది అని ఆలేరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో గురువారం, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నారు. టుడే నాట్ హాలీడే, టుడే పోలింగ్ డే అన్నారు. 2018 ఎన్నికల్లో పోలింగ్ లో ఆలేరు రెండో ప్లేస్ లో నిలిచింది అని, ఈ సారి ఫస్ట్ ప్లేస్ దక్కించుకునేలా ప్రజలు తమ ఓటును వినియోగించుకోవాలి అన్నారు.