
నవతెలంగాణ- దుబ్బాక రూరల్:
బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని మెదక్ ఎంపీ ,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం పద్మశాలిగడ్డ గ్రామానికి చెందిన రెడ్డి సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించి రూపొందించారని 10 ఏళ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, పని చేసే ప్రభుత్వాన్ని దీవించి వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి ప్రజలు ఓట్లు వేయలన్నారు. తొలిసారి సీఎం ఆదేశాల మేరకు దుబ్బాక గడ్డపై పోటీ చేయనున్న తన గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ నియోజకవర్గ ప్రజలకు సూచించారు.దుబ్బాకలో మన ప్రభుత్వ హయంలోనే పనులు జరిగాయాయే తప్ప నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక గడ్డకు నయ పైసా తేలేదన్నారు. చేరిన వారిలో పద్మశాలి గడ్డ రెడ్డి సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు రవీందర్ రెడ్డి, బాల్ రెడ్డి, రాంరెడ్డి, నారాయణరెడ్డి, రజినీకాంత్ రెడ్డి, ఉమారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, కాశిరెడ్డి, నారాయణరెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, బబుల్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.