ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఆదివారం ఇంటిటీ ప్రచారంలో  భాగంగా దుంపెల్లిగూడెం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజశేఖర్  ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా వైస్ ఎంపీపీ సూదిరెడ్డి స్వప్న లక్ష్మారెడ్డి  ఓటర్ లకి బ్యాలెట్ బాక్స్ లొ ఏ విదంగా ఓటు వెయ్యాలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ఓటర్స్ కి కేసీఆర్ అమలు చేసిన మంచి పథకాలను వివరిచ్చి చెప్పి కార్ గుర్తుకు ఓటు వెయ్యమని కోరడం జరిగింది.ఈవీఎం ప్యాడ్ లో మూడవ నెంబర్ పై కారు గుర్తుపై నొక్కి ఓటు వేసి నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి పథకాలను నిరంతరాయంగా కొనసాగించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలొ సీనియర్ నాయకులు అజ్మిరా సురేష్ పోరిక మోతిలాల్, కందుల కుమార్ స్వామి, చిట్టెపు సత్యనారాయణ రెడ్డి, దోనికల రాఘవులు, భూక్యా వెంకట్ స్వామి, పూసపాటి వెంకన్న, యూత్ అధ్యక్షులు పున్నం రవి, ఈరెల్లి ప్రవీణ్,  పార్టీ కార్యాకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.