తప్పుడు ప్రచారాలతో రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న బిఆర్ఎస్

BRS is trying to cheat farmers with false propaganda– రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి వాక్య
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తప్పుడు ప్రచారాలతో రైతులను మోసం చేసే ప్రయత్నం బి ఆర్ ఎస్ పార్టీ చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందనం,రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఆనందంగా వున్నారని, ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ విజయంతో ముందుకు వెళ్తుంది అని చూసి తట్టుకోలేక కేటీఆర్ హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతూ  ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన జివో విడుదల చేసిందని అందులో భూమి వుండి దానిపై రుణం తీసుకున్న కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని తెలపడం జరిగిందని,అదేవిధంగా నిర్ణీత గడువు 12-12-2019 నుండి 09-12-2023 ఈ ఐదు సంవత్సరాలలో రైతులు తీసుకున్న రుణం మాఫీ చేస్తామని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే మొదటి విడతగా  లక్ష రూపాయలు, రెండోవ లక్షన్నర వరకు,మూడో విడతగా రెండు లక్షల రూపాయలు చేయడం జరిగిందనీ, ఏ రాష్ట్రం కూడా ఇప్పడి వరకు రుణమాఫీ ఇంతలా చేయలేదని ,కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని ఆయన అన్నారు.
రుణమాఫీ చేయడంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదని,ఎవరికి అయితే రుణం మాఫీ అవ్వలేదో వారికోసం ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులను నియమించడం జరిగిందని, సమస్య వచ్చినా నెల రోజులో పరిష్కరిస్తామని జివో లో స్పష్టంగా చెప్పడం జరిగిందని,టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డు లేనివారికి రుణమాఫీ కాలేదని, అదేవిధంగా వివరాలు ఎవరైనా తప్పుగా వుంటే వారికి మాఫీ అవ్వలేదని వీటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జివో పూర్తిగా చూడకుండా అబదప్పు మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా సొసైటీ బ్యాంక్ లు కోడ్ బ్యాంకింగ్ తో లింక్ లేకపోవడం వల్ల వారికి మాఫీ కలేవని,వీటన్నింటి కూడా ప్రభుత్వం నైపుణ్యం గల సాఫ్ట్వేర్ ద్వారా పరిష్కరిస్తామని,ప్రభుత్వం దాదాపు ఇరవై లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా వుంది అని తెలిపారు.పది సంవత్సరాలు టిఆర్ఎస్ పరిపాలించి ప్రజలకు ఏమి చేయలేదని,ఇప్పుడు ప్రభుత్వానికి ,కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని,రైతులు ఆనందంగా వున్నారని తట్టుకోలేక బిఆర్ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తూ ధర్నాలు చేస్తున్నారని,మతి స్థిమితం లేకుండా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారనీ ఆయన అన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రైతులకు రుణమాఫీ చేయించే విధంగా వారి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారని,హరీష్ రావు కు సిగ్గు వుంటే వెంటనే రాజీనామా చేయాలని భూపతి రెడ్డి అన్నారు.గతంలో పది సంవత్సరాలలో రైతు బంధు పేరుతో రోడ్లకు,గుట్టలకు డబ్బులు ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది,లిక్కర్ స్కాం చేయడం,అవగాహన లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం ఇది టిఆర్ఎస్ నాయకుల పని అని ఆయన మండిపడ్డారు.కేసీఆర్ కు దుర్మార్గపు ఆలోచనలు వున్నాయని ప్రజలు కేసీఆర్ మోసాలను గమణించారని ఆయన అన్నారు. మహిళకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చామని,500 గ్యాస్ సిలిండర్ ఇచ్చామని,ఉచిత విద్యుత్ ఇస్తున్నామని,రైతు రుణమాఫీ చేశామని,త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన అన్నారు.టిఆర్ఎస్ నాయకులు ఇకపై అయిన బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం చేసిన పనులు చూసి కుమిలిపోకుండ ప్రజాసేవలో వుండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతరెడ్డి రాజారెడ్డి,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి,జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,కార్పొరేటర్ రోహిత్,శ్రీనివాస్,గంగారెడ్డి, ఉమ్మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.