
అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం పిరాట్వానీపల్లి గ్రామంలో బీఆర్స్ పార్టీకి భారీ షాక్ తలిగింది. అచ్చంపేట పట్టణంలో డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా శ్రేయస్సు కోరుకునే మన ప్రాంత బిడ్డ అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాయకత్వంలో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీతోనే పేదల అభివృద్ధి సాధ్యమవుతుందని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పుకొచ్చారు. ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది, కేంద్రంలో రాహుల్ గాంధీ తోనే ఈ దేశం ప్రజాస్వామ్యం రక్షించబడు అని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కట్ట , అనంత రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల ఇన్చార్జి శేఖర్ గౌడ్, గ్రామ నాయకులు చంద్రమౌళి, వార్డ్ మెంబర్ తొలా మల్లయ్య, కృష్ణయ్య,గోరటి శంకర్, సమక్షంలో పార్టీలో చేరిన లక్ష్మణ్,నక్క వెంకట్ నారి, దొడ్ల తిరుపతయ్య,శ్రీను,పటేల్ అంజి, చిన్న ఆంజనేయులు, సత్యం, గంధం మహేష్, సాయిబాబు, మధమయ్య, దొడ్ల లింగమయ, దొడ్ల పొడుగు శ్రీను,తూముల శివ,ఆలూరి బల్చేంద్రి తదితరులు పార్టీలో చేరడం జరిగింది.