బీఆర్ఎస్ బీజేపీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు బీజేపీ పార్టీల నుండి కైతాపురం సర్పంచ్ గుడ్డేటి యాదయ్య ఎనగండి తండ ఉప సర్పంచ్ కరంటోతు లచ్చు నాయక్ మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను వివరించి ఓట్లు అడగాలని కోరారు. కెసిఆర్ ను గద్దేదించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల, యువజన అధ్యక్షులు బోయ దేవేందర్, మాధగోని శేఖర్ గౌడ్, అర్ధ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.