బీఆర్ఎస్ కీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక..

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ పట్టణానికి చెందిన 15వ వార్డు  చెందిన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జనరల్ సెక్రెటరీ జాఫర్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 గ్యారంటీ పథకాలు అమలుతో పాటు అభివృద్ధి పథంలోకి వెళ్తున్నందున బీఆర్ఎస్ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు. షేక్ అప్సర్. షేక్ ఖాజామయుద్దీన్. షేక్ ఇమామ్. రసూల్ ఖాన్ .సద్దాం ఖాన్. సల్మాన్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.