గత పదేళ్ళుగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించిన ఘనత బీఆర్ఎస్ నాయకులది

BRS leaders are credited with attacking Congress workers for the past ten years– పథకాల అమలుపై కార్యకర్తలపై దాడులపై, అక్రమ కేసులపై చర్చకు సిద్ధమా

– బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్
గడిచిన 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలపై, తమ వద్దకు సమస్యలో గురించి వచ్చిన ప్రజలపై దాడులు చేయించిన ఘనత ప్రశాంత్ రెడ్డిది అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ కార్యకర్తల పైన దాడులు చేయిస్తుందని విమర్శలు చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీయవాదంతో ముందుకు వెళ్లే పార్టీ అని కార్యకర్తల గురించి ఆలోచించే పార్టీ అని ఏ రోజు కూడా టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు గాని వాగ్వాదాలకు గాని వెళ్లలేదని ,అక్రమ కేసులు పెట్టలేదాని తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్మూర్ జీవన్ రెడ్డి గాని ,బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గాని, నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ గాని ఎన్ని రకాలుగా ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో, ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించారు తమ వద్ద జాబితా ఉందని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసులు గాని దాడులు జరగలేదని వీటిపైన ఎప్పుడు నిర్ణయించిన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మానాల మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు.
ఆర్మూర్ లో ఒక సర్పంచ్ ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపిన నీచ చరిత్ర జీవన్ రెడ్డిది అని, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం మానాల గ్రామంలో దసరా పండుగ రోజున యువకులు తోపులాటలు చేసుకుంటే దానిని రాజకీయం చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన నీచ చరిత్ర నీది అని, నీవు పాలెం గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక రైతు మా గ్రామానికి పని కావాలి అని మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఉన్న అనుచరులతో అతనిపై కేసులు పెట్టించి జైల్లో పెట్టి నీ వాళ్లతో కొట్టించిన చరిత్ర ప్రశాంత్ రెడ్డి నీది అని, ముప్కల్ గ్రామంలో తండ్రి కొడుకుల పై గంజాయి కేసు పెట్టించిన ఘనత ప్రశాంత్ రెడ్డి అని, బాల్కొండ గ్రామంలో ప్రశాంత్ రెడ్డి ఇఫ్తార్ విందుకు వస్తున్న సందర్భంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మైనారిటీ సోదరులపై అక్రమ కేసులు పెట్టించాడని, 10 సంవత్సరాలు రౌడీయిజం దౌర్జన్యాలు చేసిన ప్రశాంత్ రెడ్డి అక్రమ కేసులు వేధింపుల గురించి మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వళ్ళించినట్టే ఉంది అని మానాల మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా పాలన నడుస్తుందని కానీ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాక్షస పాలన నడిచిందని, ఎమ్మెల్యే తప్ప ఏ వ్యక్తి కూడా అధికారుల దగ్గరికి వెళ్లడానికి భయపడే వాడిని కానీ ప్రస్తుతం ఎవరైనా సరే అధికారుల దగ్గరికి వెళ్లి పని చేయించుకుంటున్నారని, గతంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి తమ పార్టీలోకి లాక్కున్న వ్యక్తులు ప్రశాంత్ రెడ్డి అని మాణాల మోహన్ రెడ్డి అన్నారు.
గత 25 రోజులుగా ప్రశాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వదు అని టిఆర్ఎస్ నాయకులు చెప్పడం ద్వారా ఎంతో మంది రైతులు భయాందోళనకు గురై వడ్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం జరిగిందని, ఇప్పుడు బోనస్ వస్తున్న సందర్భంలో రైతులు నష్టపోయామని బాధపడుతున్నారని, ఈ బాధకు టిఆర్ఎస్ నాయకులు కారణం కదా మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడమే అభివృద్ధి ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యాలని టిఆర్ఎస్ నాయకులు గ్రామ సింహాలవలే ఎంత మొరిగిన పట్టించుకోకుండా ప్రజలకు చేసె మేలు చేసి తీరుతామని మానాల మోహన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రజలను విదేశాలకు పంపుతా అని బ్రోకర్ పనీ చేస్తే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఇంకోరకంగా బ్రోకర్ఇజం చేశాడని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను బ్రోకర్ లు అని చెప్పడం వారి సిగ్గులేని తననికి నిదర్శనం అని, కాంగ్రెస్ నాయకులపై గాని పార్టీపై గాని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న దీక్ష దివాస్ అనేది ఒక దొంగ దీక్ష అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం ఎంతోమంది యువకులు ప్రాణాలు అర్పించడం అని సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కష్టాలను చూసి ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ కేసీఆర్ చేసిన దొంగ దీక్ష వల్ల కాదు అని, కేసిఆర్ దీక్ష సమయంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏమేమి తిన్నాడో ప్రజలందరికీ తెలుసు అని, టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నది దీక్ష దివాస్ కాదని దొంగ దీక్ష దివాస్ అని మానాల మోహన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి ,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ ,జిల్లా ఫిషర్ మన్ చైర్మన్ శ్రీనివాస్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్ ,రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నర్సింగ్ రావు, సాయికుమార్ పాల్గొన్నారు.