
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నేత మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ను గురువారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సీనియర్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజాభవన్ ముట్టడికి వెళ్తున్న బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారని. అరెస్ట్ అయిన వారిలో నర్సింలు గౌడ్ , సాయిలు చాకలి సాయిలు, తదితరులు ఉన్నారు.