వట్టే జానయ్య యాదవ్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు దాడి

Vatte on Janaiah Yadav BRS leaders attacked– తృటిలో తప్పిన ప్రమాదం
–  పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణ
– గట్టికల్‌లో ఉద్రిక్తత
నవ తెలంగాణ-సూర్యాపేట.
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు యస్‌ మండలం గట్టికల్లు గ్రామంలో ఆదివారం రాత్రి బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో జానయ్య తృటిలో తప్పించుకోగా ఆయన అనుచరుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు గొడ్డళ, కత్తులతో దాడి చేసినా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని జానయ్య ఆరోపించారు. దీనిపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.