
గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు సురేందర్ ఆదేశానుసారం జహీరాబాద్ పార్లమెంట్ నియజకవర్గ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరుపున ప్రచారం చేయడం జరిగింది. ఉపాధి హామీ కూలీలు మరియు రైతులు మా బి.ఆర్.ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియ జేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శ్యామ్, లక్ష్మణ్ రావు, సాయిలు, మదయ్య మరియు ఉపాధి హామీ కూలీలు రైతులు పాల్గొన్నారు.