మంత్రి పొన్నం పై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు సరికాదు

BRS leaders' comments on Minister Ponnam are incorrect– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
 బీసీ, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ పై బిఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు సరి కాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం మండలంలోని పొట్లపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో  అనిల్ గౌడ్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆశీర్వదించి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను గెలిపించారన్నారు. మొట్టమొదటిసారి మంత్రి పదవి హుస్నాబాద్ కు రావడం ఈ ప్రాంత ప్రజలు గర్వంగా భావిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకువస్తూన్న మంత్రిపై విమర్శలు చేయడం టిఆర్ఎస్ నాయకుల అవేకానికి నిదర్శనం అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఇంకోసారి విమర్శలు చేస్తే అదే స్థాయిలో ప్రతిఘటించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిసి నాయకులు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, గంపల శ్రీనివాస్, పిల్లి తిరుపతి, గిరిజన నాయకులు లౌడియా బిఖ్య నాయక్ పాల్గొన్నారు.