సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

BRS leaders distributed CMR chequesనవతెలంగాణ – తొగుట
సీఎంఆర్ చెక్కులతో లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూరుతుందని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరి కృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం మండలం లోని గోవర్ధనగిరి గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే  కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవతో మంజురైనా సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. మాజీ సర్పంచ్ తోయేటి  ఎల్లయ్య రూ. 60 వేలు, తోయే టి రక్షిత రూ. 11 వేలు అందజేశారు. ఈ కార్య క్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నంట. పరమేశ్వర్ రెడ్డి, ఏఎంసి మాజీ డైరెక్టర్ దుబ్బాక కనకయ్య, గ్రామ బూత్ అధ్యక్షులు గడ్డం రాఘ వులు, యువకులు మండల కుమార్, మల్యాల స్వామి, ఉప్పరి నరేంద్ర, చింత బైరా రెడ్డి, ఉప్పరి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.