నవతెలంగాణ -తాడ్వాయి
తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లుగా ఏగతాడిగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప, అభివృద్ధి చేసింది ఏమీ లేదని, బంగారు తెలంగాణ చేస్తా అని, అప్పుల తెలంగాణ చేసిండు అని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి బి ఆర్ ఎస్ కు, బీజేపీ నాయకులకు లేదు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బెజ్జూర్ శ్రీనివాస్ మండల కేంద్రంలో ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత ముఖ్యమంత్రి అని మాట చెప్పి, తీరా ఎన్నికల్లో గెలిచాక సీఎం కుర్చీ కైవసం చేసుకుని, దళితులను మోసం చేశాడని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి, అరకురగా కట్టి చేతులు దులుపుకున్న ఘనత కేసిఆర్ దే అన్నారు. రైతన్నలకు ఉచిత ఎరువులు యూరియా పంపిణీ చేస్తా అని రైతన్నల నడ్డి విరిచిన చరిత్ర కేసీఆర్ దే అన్నారు. ఇంటికి ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని మోసపూరిత వాగ్దానాలు అన్నారు. లా చెప్పుకుంటూ పోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. నిజమైన పాలన ఏంటో ఈ ఒక్క సంవత్సరంలోనే తెలిసిందని, రైతు బంధు చెట్లకు గుట్టలకు కొండలకు సినిమా హాళ్ళకు కాకుండా నిజమైన రైతులకు భూమిని సాగు చేసుకుంటున్నా పంట వేస్తున్న రైతులకు అందిస్తున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి 2000 యూనిట్లు ఉచిత విద్యుత్, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, లేని పేదవారికి గ్రామసభల ద్వారా గుర్తించి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు పదేండ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని, ఒకటే సంవత్సరంలో చేసి చూపించామన్నారు.