తుమ్మలను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదు…

నవతెలంగాణ – అశ్వారావుపేట : అభివృద్ధి,సంక్షేమ ప్రధాత గా సేవలందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శిస్తే సహించేది లేదని స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగళ్లపు చెన్నకేశవరావు అన్నారు.  మంగళవారం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి తుమ్మలను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు.స్వార్ధం లేకుండా నిరంతరం అభివృద్ధి, రోడ్లు, సంక్షేమం, సాగు, తాగునీటి పథకాలను ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నిలిచిపోయిన సీతారామ ప్రాజెక్టుతో పాటు
భద్రాచలం వద్ద గోదావరిపై రెండవ వంతెన పనులు ఏళ్ల తరబడి నిలిచిపోతే,వీటిని పున:ప్రారంభించి పూర్తి చేశారని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి తుమ్మల అవేదన చెందాల్సిన అవసరం లేదని,మీపై పూర్తి నమ్మకం జిల్లా, రాష్ట్ర ప్రజానీకానికి ఉందన్నారు.తక్షణమే బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్,బండి భాస్కర్,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, కేవీ సత్యనారాయణ, ఎస్ పాషా, పీ జీవన్ రావు,సత్యవరపు బాలగంగాధర్,సింహాద్రి ప్రసాద్ ఉన్నారు.