ఎంపీడీవో, ఎస్సైని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ – వలిగొండ రూరల్

నూతనంగా బదిలీపై వచ్చిన ఎంపీడీవో జితేందర్ రెడ్డిని, ఎస్సై మహేందర్ లాల్ ను వెలువర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వెలువర్తి గ్రామ శాఖ అధ్యక్షులు కలుకూరి రాములు, మత్స్యశాఖ చైర్మన్ చెవ్వ వెంకటేశం, దేవాలయ కమిటీ చైర్మన్ నానమాల ఉప్పలయ్య, బిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి నాగిళ్ల యాదగిరి, విద్యా కమిటీ చైర్మన్ కడవేరి యాదగిరి, యూత్ అధ్యక్షుడు మల్లెం నరేష్, బుడిగే కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.