నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో గంగమ్మ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ” నత్త నడకన బ్రిడ్జి పనులు ” శీర్షికను నవ తెలంగాణ మంగళవారం ప్రచూరించగా, ఎంపీపీ దశరథ్ రెడ్డి తో పాటు బి ఆర్ ఎస్ నాయకులు స్పందించి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి మాట్లాడుతూ….. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చొరవతో, మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేసి, టెండర్ నిర్వహించిన, కాంగ్రెస్ ప్రభుత్వం పనులను పట్టించుకోకపోవడంతో, బ్రిడ్జి పనులు ” ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ” నడుస్తున్నాయ, వెంటనే ప్రభుత్వం వర్షాలు కురియాకముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి చేయకపోతే నిరసనలతో, ధర్నాలతో ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంబంధిత అధికారులకు చరవాణిలో బ్రిడ్జి పనులపై సమాచారం అందించి, వెంటనే పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు లింబాద్రి నాయక్, జంగం లింగం, బొమ్మేడి సాయి రెడ్డి, సుధాకర్, సుమన్, మహిపాల్, శంకర్, నరసింహులు తదితరులు ఉన్నారు.