నవతెలంగాణ-కుల్కచర్ల
మండలం కుసుమ సముద్రానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, బ్లాక్ బి అధ్యక్షులు కర్రె భరత్ కుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పలువురు మాట్లాడు తూ..రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధి స్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుర్ర ఆశయ, పానగారి రామయ్య, పానగారి నరసయ్య, పుర్ర చంద్రయ్య, ఏపూరి యాదయ్య, మహ్మదాబాద్ కృష్ణయ్య పులి భీమయ్య, శ్రీశైలం, విశాల్, గజ్జి భీమయ్య, పుర్ర మాసయ్య, పులి రాఘవేందర్, రాములగౌడ్, కేశవులు తిరు మలై, బైరం శ్రీధర్, శంకర్, డేగ తిరుపతయ్య, బాబు, యాదయ్య, సతీష్, వెంకటేష్ పాల్గొన్నారు.