జుక్కల్ మండలంలో బీఆర్ఎస్ ముఖ్యనాయకులు కాంగ్రేస్ లో చేరిక

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని వివిధ గ్రామాల లోని బీఆర్ఎస్ ముఖ్యనాయకులు ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ సమక్షంలో కాంగ్రేస్ తీర్థం తీసుకోవడం జర్గింది. బుదువారం నాడు మండలంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయమలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతు లాడేగాం, డోన్గాం, చిన్న ఎడ్గి ,పడంపల్లి, జుక్కల్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకులు కాంగ్రేస్ కండువాా కప్పి పార్టీలోకి ఆహవ్వనించడం జర్గింది. నాయకులు, కార్యకర్తలు ఎవరు అందోళన చెందాల్సిన ఇవసరం లేదని, కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జర్గుతుందని, తగిన ప్రాదాన్యత ఉంటుందని బరోసా ఇచ్చారు. నియేాజక వర్హం ఆభివృద్ది చేయాలంటే అందరి బాగస్వామ్యం ఉండాలనే చేరికలకు ప్రోత్సహిస్తున్నాని పేర్కోన్నారు. మరి కొద్ది రోజులలో బీఆర్ఎస్ పూర్తీగా ఖాలీ అవుతుందని, రెండు సార్లు ఎంపిగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బిజేపీ లోకి చేరడం నిదర్శమని తెలిపారు. రాబోయేపార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రేస్ అబ్యర్థిని గెలిపించాలని కోరారు.