ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం బోర్గం గ్రామం బిఆర్ఎస్ నాయకులు బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలకు ఆకర్షించిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారని వారు పేర్కొన్నారు పార్టీలో చేరిన వారిలో రెంజల్ సింగిల్ విండో చైర్మన్ మొయినుద్దీన్, మాజీ సర్పంచ్ గొజ్జ రమేష్, సొసైటీ డైరెక్టర్లు పుట్టి సాయి రెడ్డి, ఖదీర్ పాషా, బిఆర్ఎస్ నాయకుడు అతిక్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, ధనుంజయ్, మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, భూమా రెడ్డి, గంగా కృష్ణ, కార్తీక్ యాదవ్, సిద్ధ సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన రెంజల్ గ్రామానికి చెందిన మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ సమీ, టిఆర్ఎస్ యువజన సంఘం మండల అధ్యక్షులు షబ్బీర్, వార్డ్ మెంబర్ ఇర్ఫాన్ లు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. వారి వెంట మాజీ జెడ్పిటిసి నాగభూషణ్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ ఎంఎస్ రమేష్ కుమార్, అహమ్మద్ చౌదరి, మాజీ ఎంపీటీసీ కవిత, బి రవి, సాయిబాబా గౌడ్, లచ్చేవారు నితిన్, వేణు, తదితరులు పాల్గొన్నారు..