మాజీ మంత్రిని కలిసిన బీఆర్‌ఎస్‌ నాయకులు

– తమది కేసీఆర్‌ వర్గమే..
– పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను దూరంపెడుతున్నాడు
– పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్న వంటేరు
– మాజీ మంత్రి దృష్టికి తీసుకు వచ్చిన నాయకులు
నవతెలంగాణ-మనోహరాబాద్‌
పార్టీకి నిజాయితీగా పనిచేస్తున్న కార్యకర్తలను దూరం పెడుతూ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన కార్యకర్తలను దగ్గరకు తీస్తూ గ్రూపు రాజకీయాలను వంటేరు ప్రతాప్‌రెడ్డి చేపడుతున్నారని వ్యతిరేక వర్గం నాయకులు మాజీ మంత్రి హరీశ్‌రావును దృష్టికి తీసుకువచ్చారు. తూప్రాన్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవెందర్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్‌రెడ్డిల ఆధ్వర్యంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యతిరేక వర్గం భారీ ఎత్తున కలిసి సిద్దిపేటకు శుక్రవారం తరలివెళ్లారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి తూప్రాన్‌ మం డలంలో గ్రూపు రాజకీయాలను చేపడుతున్నాడని ఆయనకు అనుకూలంగా ఉన్నవారితో కలిసి, కేసీఆర్‌ కోసం పనిచేసే తమ లాంటి నిజమైన కార్యకర్తలను విస్మరిస్తున్నట్టు వారు మాజీ మంత్రి హరీష్‌రావ్‌ దృష్టికి తీసుకువెల్లినట్టు తెలిసింది. అలాగే తూప్రాన్‌ మున్సిపల్‌లో ముందుగా గ్రూపులను తయారు చేసింది ఆయనేనని కౌన్సిలర్లను విడదీసి బీఆర్‌ఎస్‌లోనే కాకుండా ఇతర పార్టీకి పంపిన వ్యక్తి వంటేరు ప్రతాప్‌రెడ్డి అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను దూరంగా ఉంచుతున్నాడని పార్టీ కి పనిచేయని వారిని వెంటపెట్టుకుని తన క్యాడర్‌ను కాపా డుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు వారు తెలిపారు. గతంలో కేసీఆర్‌పై పోటీచేసిన సమయంలో ఆయన వెంట ఉన్న వారిని కాపాడుకోవాలని, వారినే దగ్గరకు తీస్తున్నాడన్నారు. దాంతో ఆయన క్యాడర్‌ను కాపాడుకోవాలని చూడడంతో పాటు నిజాయితీగా పార్టీ అభివృద్ది కోసం పనిచేసే తమ లాంటి నాయకులు కార్యకర్తలను దూరంగా ఉంచు తున్నారని, వీరంతా పార్టీలో నుంచి వెల్లిపోవాలనే లక్ష్యంతో వంటేరు పని చేస్తున్నట్టు ఆయన దృష్టికి తీసుకెల్లినట్టు తెలి పారు. పార్టీని నాశనం చేయడమే లక్ష్యంగా వంటేరు ప్రతాప్‌ రడ్డి పనిచేస్తున్నాడని, పార్టీ కోసం పనిచేస్తున్న నిజమైన కార్యక ర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమరిపై ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావును కోరినట్టు తెలిపారు. తూప్రాన్‌ మండలం, మున్సిపల్‌ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు.