నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పస్రా నూతన సీఐ రవీందర్ ని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. సీఐ రవీందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలో కొంతమంది యువత మద్యం మత్తు పదార్థాలు అలవాటు పడుతున్నారని చెడు మార్గం నుంచి మంచి మార్గానికి వచ్చేలా కృషి చేయాలని వారు కోరారు. మండలంలో జరిగే కొన్ని నేరాలను అదుపు చేయాలని మనవి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దండగల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, నూశెట్టి రమేష్, మాజీ సర్పంచ్ లు గడ్డం అరుణ, జాజ చంద్రం మహిళా నాయకులు సోమనాగమ్మ, నాయకులు ఎండి రఫీక్, గడదాసు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.