నూతన ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ – చివ్వేంల
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ సంతోష్ కుమార్ ను సోమవారం బి ఆర్ ఎస్ నాయకులు మాజీ సర్పంచుల ఫోరం మండల  అధ్యక్షులు జూలకంటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భద్రు నాయక్ పాల్గొన్నారు.