నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అమలు చేయబోతున్న ప్రజా సంక్షేమ పథకాల ఎంపిక గురించి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను, సభలు నిర్వహిస్తున్న అధికారులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకునే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి రణదేవ్ బుధవారం ఒకప్రకటలో ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనుభవించి రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుని అప్పుల కుప్పగా చేసినట్లుగా ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు అందకుండా సభలు నిర్వహిస్తున్న అధికారులతో గొడవకు దిగుతూ అడ్డుకునే కుట్రలో భాగంగానే గ్రామ సభలల్లో గొడవ పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీకి సంభందించిన యువత అధిక సంఖ్యలో హాజరై గ్రామసభలు ప్రశాంతంగా జరిగేలా అధికారులకు సహకరించాలని కోరారు.