
ముత్తారం ఎంపీడీఓగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన లలితను బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పూలబకే అందజేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, వైస్ ఎంపీపీ సుదాటి రవీందర్ రావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, నాంసాని సమ్మయ్య, ఎంపిఓ వేణు మాదవ్, సిబ్బంది పాల్గన్నారు.