ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గురువారం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి,420 రోజులు అవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, బీఆర్ఎస్ పార్టీ తరపున అన్ని గ్రామాల్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.