ఉట్ల మోహన్ ను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

BRS leaders visited Utla Mohanనవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకులు ఉట్ల మోహన్ ఐదు రోజుల క్రితం ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంవలన చర్మం కాలడం  జరిగింది. విషయం తెలుసుకుని గురువారం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎం.పీ.పీ. సూడి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు లకావత్ నరసింహ నాయక్, మరియు సీనియర్ నాయకులు  పరామర్శించడం జరిగింది. అధైర్య పడొద్దు మీకు ఎల్లవేళలా బి ఆర్ ఎస్ పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నాం పూర్ణచందర్,గోవిందరావుపేట ఉపాధ్యక్షులు చుక్కగట్టయ్య, వెంకన్న,బై కాని ఓదేలు,   కృష్ణారెడ్డి,మచ్చాపూర్ బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.