
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో బాధితులకు కొంతై నా మేలు చేకూరుతుందని బీఆర్యస్ గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ అభిద్ హుస్సేన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ యాదగిరి, సంకుర్తి లక్ష్మాన్ లు అన్నారు. బుధవారం లింగంపేట్ గ్రామానికి అందె పోచయ్య కు రూ. 11 వేల చెక్కును అంద జేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన చేశామని అన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మంగ నర్సింలు, గొడుగు ఐలయ్య, సంకుర్తి నర్సింలు, కొల్గురి కరుణాకర్ తదితరులు ఉన్నారు.