గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు చింతల..

BRS leaders worried about Gandhi's statueనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గురువారం భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ కి విమర్శించే హక్కు కోమటిరెడ్డి కి లేదనీ, అరు గ్యారంటీ లా అమాల్లో ప్రభుత్వం విఫలం అయిందనారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టి ఎడాది గడుస్తున్నా అరు గ్యారంటీ లని అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందనీ, భూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినా సిఎం రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. కొన్ని రోజులు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని, కొన్ని రోజులు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ ప్రజలకు ఇస్తానన్న హామీలను పక్కన పెట్టి ప్రజలను మభ్యపెడుతూ రేవంత్ సర్కార్ కాలం గడుపుతుందని విమర్శించారు. ఒకటో తారీఖున జీతాలు రావడం లేదనీ, పంద్రాగస్టున పంటరుణం మాఫీకాలేదాని, బస్సుల్లో సీట్లు దొరుకుతలేవని, ఆటో కార్మిలకు ఇస్తాన్న 12,000 జడ లేదన్నారు. వ్యవసాయ కూలీలకు ఇస్తానన్న 12,000,రైతు భరోసా పైసలు, రైతు బీమా, ఇందిరమ్మ ఇండ్లు, పెంచుతానన్న పించను , కళ్యాణ లక్ష్మి లో తులం బంగారం, 420 రోజులు దాటినా ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మీడియాను గొంతు నొక్కి, మీరు గొంతు చించుకొని మైకు ముంగట గప్పాలు కొట్టుడు బూతులు తిట్టడం తప్పా,మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతన్నలకు చేసిందేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్,సింగిల్ విండో నోముల పరమేశ్వర రెడ్డి, జిల్లా నాయకులు కుతాడి సురేష్,వళ్లపు విజయ్,బతక అశోక్,బామరపు బాలరాజు,పండుగ కిరణ్,దాండబోయిన బాలరాజు,గంజి సందీప్ కుమార్,గాజుల నవీన్,sk యాకూబ్,షరీఫ్,మోతే మనోహర్,భాషీర్,లక్ష్మణ్, నరసింహ,పల్లేపాటి కొండల్, సామల చంద్ర మోహన్,నాగారం నరేష్,మిర్యల శేషు,సాయి కుమార్ లు పాల్గొన్నారు.