మండలంలోని ఇటీవల మృతి చెందిన కొండపర్తి గ్రామానికి చెందిన ఈసం నాగయ్య కుటుంబానికి ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు శనివారం 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈసం సుదర్శన్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈసం నాగయ్య చాలా మంచి వారని, వారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం ఉన్నారు. మొదట ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దుర్గo రమణయ్య, మాజీ జడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ, తాజా మాజీ సర్పంచ్ జాజ చంద్రం, మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ రేగ నరసయ్య, తాడ్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు తుమ్మల రాజేందర్ ముదిరాజ్, కొర్నెబెల్లి శేషగిరిరావు, యూత్ సభ్యులు చీమల శ్రవణ్, సోషల్ మీడియా ఇంచార్జ్ పాయం ప్రేమ్, సోలం రాము, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.