
గాంధారి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధారి మండల బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు గండిపేట్ మాజీ సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్, AMC మాజీ చైర్మన్ కాంతారెడ్డి, మేడిపల్లి గ్రామ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు షాబుద్దిన్ & AMC డైరెక్టర్ తిరుపతి, బర్గుల్ గ్రామ మాజీ సర్పంచ్ రవి, డైరెక్టర్ ప్రవీణ్, బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి పరిష్కారానికి చేస్తున్న కృషిని చూసి బిఅర్ఎస్ పార్టీకు రాజీనామా చేసి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు. కాంగ్రెస్స్ పార్టీలో స్వాగతించినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.