ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ నాయకులు..

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలంలో సాటాపూర్, నీలా, కందకుర్తి, బోర్గం గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారానికి శ్రీకారం చెప్పారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వారు ఉపాధి హామీ కూలీలను కోరారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక సంక్షేమ ఫలాలను అందించిన ఘనత తమ పార్టీకే దక్కతుందని వారు స్పష్టం చేశారు. సాఠాపూర్ లో తాజా మాజీ సర్పంచ్ వికార్ పాషా, సాయిలు, నీలా గ్రామంలో రాఘవేందర్, భాస్కర్, కందకుర్తి మోసిన్ బేగ్, గౌస్, బోర్గం గ్రామంలో ఫెరోజ్ బేగ్, పార్థరాజు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.