నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
మండలంలోని చర్లపాలెం గ్రా మానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకు డు మైనార్టీ సెల్ మండల ఉపాధ్యక్షు డు ఎండి అమీర్ పార్టీ సభ్యత్వానికి తన పదవికి రాజీనామా చేస్తూ బుధ వారం ఒక ప్రకటనలో తెలియజేశా రు. గత ఐదు సంవత్సరాలుగా టి ఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి ఎమ్మెల్యే, ఎంపీటీసీ, సర్పం చ్‌ల గెలుపుకు కృషి చేసి గత కొంతకాలంగా చర్లపాలెం వాసి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి దంపతులు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని వస్తున్న వార్త కథనాలను రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో వారిని కలిసిన దశ్యం చూసి వారు గతంలో నుండి చెర్లపాలెం గ్రామ హై స్కూల్ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ స్థలం ఏర్పాటులో భాగంగా తొర్రూర్ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో ఆకర్షితులై ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయుటకు రాజీనామా చేస్తున్నట్లు అమీర్ తెలిపారు.