ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  గణేష్ బిగాల 

 – ప్రచారానికి బ్రహ్మ రథం పట్టిన మహిళలు
 – ప్రతి ఇంటి నుండి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు
 – బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల కి మద్దతు తెలిపిన 37, 38వ డివిజన్ ప్రజలు
నవతెలంగాణ- కంఠేశ్వర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 37, 38వ డివిజన్ లలో అంబేద్కర్ కాలనీ, సంజీవయ్య కాలనీ, అరుంధతి నగర్, ఆదర్శ్ నగర్ లలో కాలన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర అభివృద్ధి మీ ముంగిట ఉంది. ప్రతి డివిజన్ లో సిసి రోడ్లు, బిటి రోడ్లు డ్రైనేజి లు నిర్మాణం చేసాము. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ఆర్ యు బి నిర్మాణం చేసాము. యువత కి ఉపాధి కోసం నిజామాబాద్ నగరం లో ఐటి హాబ్ నిర్మాణం చేసి స్థానిక యువతకి ఉపాదిని కల్పించాము. నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరడానికి మినీ ట్యాంక్ బండ్ అద్భుతంగా నిర్మించాము. మరణించిన వ్యక్తి ని గౌరవం గా సాగనంపేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠదామలు నిర్మించాము. మరోసారి దీవిస్తే ఇస్తే ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి కనెక్షన్లు ఇస్తాము. ప్రతి ఇంటికి 24 గం.లకు మంచి నీరు ఇస్తాము. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందలన్న, మరింత మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలన్న కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్,37వ డివిజన్ కార్పొరేటర్ కాంపల్లి ఉమారని ముత్యాలు, ప్యాట సంతోష్,నరేష్ యాదవ్, కో అప్షన్ సభ్యులు దారం సాయిలు, నాయకులు షఫీ, రాజేష్, ప్రవీణ్, ఇబ్రహీం,కన్నా రాము తదితరులు పాల్గొన్నారు.