మంత్రిని కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంచిర్యాల జిల్లాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ శుక్రవారం కలిశారు. మంచిర్యాలో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పుట్ట మధూకర్‌ పలు విషయాలపై చర్చించారు. మంథని నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోందని అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడ్డదని అంతిమ విజయం మనదేనని భరోసా ఇచ్చారు. ఆయన వెంటా మండల రైతు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, పిఏసిఎస్ చైర్మన్ చేప్యాల రామారావు, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాఘవ రెడ్డి ఉన్నారు.