
నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో విద్యార్థుల, ఉద్యమకారుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ నేడు నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల వంశం కి పోతున్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. బుధవారం తెలంగాణ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ చేస్తా అన్నటువంటి కేసీఆర్ ని అందరూ కలిసి సీఎం సిటులో కూర్చోబెడితే నేడు తెలంగాణను నిజం పాలనల పాలిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక కనీసం ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయలేదని విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ సాకాలంలో చెల్లించకుండా , పదవ తరగతి నుంచి గ్రూప్స్ పరీక్షల వరకు పేపర్ లీకులు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులు పాస్ చేస్తూ మంత్రులకు ఎమ్మెల్యేలకు విద్యావ్యవస్థని అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలి అంటే కల్వకుంట్ల వంశం చేతుల్లో బలైపోతున్నటువంటి తెలంగాణను కేసీఆర్ నీ గద్దె దించి విముక్తి కల్పించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ సహాయ కార్యదర్శి దినేష్ , ఉపాధ్యక్షులు చిత్రం సభ్యులు ప్రవీణ్, నవీన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు