ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల

నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్  మహేష్ బిగాల శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ కాలనీ లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. కారు గుర్తుకి ఓటు వేసి  గణేష్ బిగాల ని గెలిపించి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 45 వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, సూదం రవిచందర్, మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తం, మాకు రవి, ఆకులశ్రీశైలం, శివ లింగం, మార ప్రభు, పుప్పాల రవి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.