
కరీంనగర్ పట్టణంలోని దాసరి విజయ గార్డెన్ యందు నేడు నిర్వహించనున్న పార్లమెంట్ యుద్దభేరి సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ నాయకుడు బోనగిరి ప్రభాకర్ శనివారం పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హజరవుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హజరై విజయవంతం చేయాలని ప్రభాకర్ కోరారు. జిల్లా నాయకులు మేకల రవీందర్,యువజనాధ్యక్షుడు బిగుల్ల మోహన్,నాయకులు దీటీ బాలనర్స్,బోనగిరి ఆనంద్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.