నవతెలంగాణ-రెంజల్: రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో సర్పంచ్ బైండ్ల రాజు, బీఆర్ఎస్ నాయకులు ఇబ్రహీంల ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ షకీల్ ఆమీర్ ను అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని వారు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమేష్ రాజా గౌడ్, గుంజే గంగాధర్, బాలకృష్ణ, నరసాగౌడ్, రాయనర్స్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.