– ఊరూరా భాజా భజంత్రీలతో మహిళల హారతులతో స్వాగతం,
– స్వతంత్ర 75 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి పదేళ్ల కాలంలో జరిపిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వానిదే
– ఎన్నికల ప్రచారంలో హనుమంతు షిండే,
నవ తెలంగాణ- మద్నూర్:
మద్నూర్ మండలంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంతు షిండే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం నాడు మద్నూర్ మండలంలోని పెద్ద తడూగుర్, చిన్న తడుగూర్, అంతాపూర్ సోమూర్ దన్నూర్. ఈ ఐదు గ్రామాల్లో ముమ్మరంగా జోరుగా ప్రచారాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే హనుమంతు షిండేకు గ్రామాల్లో భాజా భజంత్రీలతో స్వాగతించారు మహిళలు ఆరథులతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదని ఈ పది సంవత్సరాలు కాలంలో ఈ మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థం డబుల్ రోడ్డు సింగిల్ రోడ్డు బీటీ రోడ్లుగా మార్చడం ప్రజలకు ఎక్కడికి వెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందని ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని ప్రజా అవసరాల కోసం సంక్షేమ పథకాలు అమలు రైతు అభివృద్ధి కోసం రైతుబంధు పథకం వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా అందించడం వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళకు బీడీ కార్మికులకు గీతా కార్మికులకు పెన్షన్లు 200 నుండి రెండువేల కు వేలకు పెంచడం జరిగిందని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా అవసరాల కోసమే పథకాలు అమలు చేస్తున్నారని అభివృద్ధిని చూసి ఆశీర్వదించి మళ్లీ గెలిపించుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ప్రజల కోసం మరిన్ని కొత్త పథకాలు అమలుపరచడానికి మినీ ఫెస్టో ప్రకటించడం జరిగిందని బీద ప్రజలకు బీమా సౌకర్యం సౌభాగ్య లక్ష్మి పథకంతో ప్రతి ఇంటి మహిళకు నెలకు 3000 అమలు 400కే సిలిండర్ అందజేత రైతుబంధు పెంపు ఇలా పథకాలు అమలు కావాలంటే కెసిఆర్కే సాధ్యమని ఆయన ప్రజలకు తెలిపారు. గురువారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు గ్రామాల్లో ఎమ్మెల్యేకు ప్రజలు నీరాజనాలు పలికారు ప్రజలకు కల్పించిన అభివృద్ధి పట్ల మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీనే భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద తడుగూరు సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు బసవరాజ్ పటేల్ ఆ గ్రామ నాయకులు నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్ ఆ గ్రామ ఎంపిటిసి సభ్యురాలు ఉపసర్పంచ్ సభ్యురాలు పార్టీ నాయకులు పాల్గొనగా చిన్న తడుగూర్ గ్రామ సర్పంచ్ సరస్వతి పార్టీ నాయకులు పాండురంగ పాటిల్ అత్తాపూర్ గ్రామ సర్పంచ్ సుగుణబాయి ఉపసర్పంచ్ కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు రాజు గంగాధర్ అదేవిధంగా సోమూరు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గంగాబాయి కాశీనాథ్ పటేల్ దన్నూర్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ముక్తాబాయి గ్రామ పెద్దలు నాయకులు దేవిదాస్ పటేల్ ప్రజా ప్రతినిధులు డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మండల ఎంపీపీ వాగ్మారే లక్ష్మీబాయి యువ నాయకులు శివ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులు గఫర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ డోంగ్లి మండల పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ పాకాల విజయ్ పండిత్రావు పటేల్. ఈ ముఖ్య నాయకులతో పాటు ఉమ్మడి మద్నూర్ మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.