బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించండి 

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు
నవతెలంగాణ – నెల్లికుదురు 
బీఆర్ ఎస్ పార్టీ మహబూబ్ పార్లమెంటు అభ్యర్థి మాలత కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని నలికుదురు మండల ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావ్ జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ జిల్లా నాయకుడు నల్లని నవీన్ రావు రైతు సమన్వయ సమితి జిల్లా మండల కోఆర్డినేటర్ బాలాజీ నాయక్ వెంకటేశ్వర రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి రమేష్ శ్రీనివాస్ అన్నారు. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని రామన్నగూడెం నల్లగుట్ట తండా రాజుల కొత్తపల్లి గ్రామం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామం నెల్లికుదురు గ్రామాలలో గురువారం పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసి గత కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ, ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి మోసపూరిత ప్రకటన చేసి అధికారంలోకి  వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల చెప్పు ప్రజలు మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకోసం ప్రతిపక్ష పాత్రలో ఉంచి ప్రజల అభివృద్ధి కోసం గళం విప్పే అభ్యర్థి కవిత అని ఆమె కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల మండల ఫోరం అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బిక్కు నాయక్, మండల కోఆర్డినేటర్ వెంకటేశ్వర్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు పాశం రమేష్ , మాజీ సర్పంచ్ కాశమల్ల పద్మ సాయిలు, బొల్లు మురళి పిడుగు యాకన్న తాళ్ల వెంకటరెడ్డి నోముల వెంకన్న వార్డ్ మెంబర్స్ మధుసూదనా చారి ,బండి శీను ,మాజీ ఉపసర్పంచ్ కనుక వీరయ్య కొత్త నరేష్, సురేష్, పడాల మధు  పాల్గొన్నారు.