రేపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

– ముఖ్యదితులుగా హాజరు కానున్న పుట్ట మదుకర్, కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు మంగళవారం సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం ఉంటుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్ సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఈ సన్నాహక సమావేశానికి  ముఖ్య అతితులుగా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్  హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.