బీ.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల

– ఎన్నికల సమరశంఖం పూరించిన గులాబీ దళపతి కేసీఆర్

 – సబ్బండ సంక్షేమమే ధ్యేయంగా మ్యానిఫెస్టో
– హర్షం వ్యక్తం చేసిన గులాబీ శ్రేణులు
– మ్యానిఫెస్టో విడుదల లో బీ.ఆర్.ఎస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం
– పెద్ద ఎత్తున అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సంబురాలు
– టపకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచిన నాయకులు
నవతెలంగాణ- కంటేశ్వర్:
బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల మ్యానిఫెస్టోని ఆదివారం విడుదల చేసారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చేలా బీ.ఆర్.ఎస్ పార్టీ మ్యానిఫెస్టో కలిగి ఉన్నందున బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, బీ.ఆర్.ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, సూదం రవి చందర్, బీ.ఆర్.ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.