బిజెపి పార్టీకి “బి” టీమే బిఆర్ఎస్ పార్టీ

బిజెపి పార్టీకి "బి" టీమే బిఆర్ఎస్ పార్టీ..– కల్వకుంట్ల కవిత అరెస్ట్ పారమెంట్ ఎన్నిక స్టంట్ మాత్రమే అంతా ఓ డ్రామా
– దండు రమేష్

నవతెలంగాణ- భూపాలపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ చైర్మన్ దండు రమేష్ శుక్రవారం తాడిచర్ల లో విలేకురుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో అయన మాట్లాడుతూ. కవిత  అరెస్ట్ బిజెపి,బిఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం అని లిక్కర్ కేసులో బలమైన సాక్షాధారలు ఉన్నప్పటికీ ఇన్నేన్నాళ్లుగా అరెస్టు చేయని కవితను రేపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తదని తెలిసి హ‌డావుడిగా  ఈడి అధికారాలు కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకు వెళ్లడం వెనక తెలంగాణ ప్రజలతో పాటు యావత్తు భారత దేశ ప్రజలు అవాక్కైయ్యారు అని అన్నారు  గత సంవత్సర కాలంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని అందులో కల్వకుంట్ల కవిత ముఖ్య భూమిక ఉందని ప్రత్యక్ష సాక్షి అయిన పిళ్లై వ్రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్ లో కల్వకుంట్ల కవిత పేరు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు,ఏ కార్ లో ఆ డబ్బు పెట్టారు అని వారు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చిన కూడా అరెస్ట్ చెయ్యని ఈడి రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తారని తెలిసి ఈ రోజు   అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లడం వెనుక అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.  కవితను అరెస్ట్ చేయడంతో బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో సానుభూతి ఓట్లు పడతాయని ఒక ఎత్తుగడ, బిజేపీ పార్టీకి తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో, దేశవ్యాప్తంగా ఓట్లు పడతాయనే ఎత్తుగడతో కవితను అరెస్ట్ చేసారే తప్పా ఇందులో ఏమి లేదని వెల్లడించారు. బిజెపి పార్టీకి “బి” టీమే బిఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు తెలుసు బిజెపి,బిఆర్ఎస్ పార్టీలు ఎన్ని నాటకాలు ఆడినా,ఎన్ని ఎత్తుగడలు వేసినా కానీ ప్రజల దీవెనతో దేశంలో రేపు అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అయన అన్నారు.