బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్

BRS party leaders arrestedనవతెలంగాణ – కామారెడ్డి 
బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి  ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడికి నిరసనగా మాజీ మంత్రి  హరిష్ రావు  పిలుపు మేరకు కామారెడ్డి పట్టణ బిఆర్ఎస్ పార్టీ తరపున శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తున్న పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి కామారెడ్డి పట్టణ పోలిస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయినవారిలో బిఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు పిప్పిరి వెంకటి, జూకంటి ప్రభాకర్ రెడ్డి, మల్లన్నగారి భూంరెడ్డి, కౌన్సిలర్లు ఎండి, నజీరోద్దిన్, పిట్ల వేణుగోపాలు, గెరిగంటి లక్ష్మినారాయణ, సంగి మోహన్, అన్నారం నరేష్ రెడ్డి, ఎండి షౌకత్ అరెస్ట్ చేశారు.