
మండలంలోని ఏదుళ్లగూడెంకు చెందిన మునుకుంట్ల బాలశెట్టి గౌడ్ ఇటీవల మృతిచెందడంతో వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో పార్టీ నుండి మంజురైన రూ.2 లక్షల భీమా చెక్కును ఆదివారం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సహకారంతో మండలంలోని నాతాళ్లగూడెం కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ లేని 21 మంది యువతకు ఆయన స్వంత నిదులతో ఏర్పాటుచేసిన లర్ణింగ్ లైసెన్స్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొంతం శ్రీనివాస్, ఎంపీటీసీ మోటె నర్సింహా, గ్రామ శాఖ అధ్యక్షులు వీరమల్ల బాలేశ్వర్, మాజీ ఎంపిటిసి ఉద్దగిరి భాస్కర్, మోటే లింగ స్వామీ, సైదులు, భరత్,వీరమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.