
నాగారం గ్రామానికి చెందిన బండ అంజయ్య, బండ జంగమ్మ దంపతులు ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై మరణించడంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా ద్వారా మంజూరైన రూ. 2 లక్షల రూపాయల ఇరువురి చెక్కులను భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శనివారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మొగుళ్ళశ్రీనివాస్, పలుసం రమేష్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, ఎల్లంకి స్వామి, సలీం, నాగార్జున, సత్తయ్య, కళ్లెం మారయ్య తదితరులు పాల్గొన్నారు.