విడిసి భూమి కబ్జా చేస్తే ఊరుకునేది లేదు: బిఆర్ఎస్ పార్టీ

There will be no peace if the land is occupied: BRS Partyనవతెలంగాణ – భిక్కనూర్
మండల కేంద్రంలో గతంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన 10 గుంటల స్థలాన్ని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని పట్టణ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంబల్ల మల్లేశం హెచ్చరించారు. సోమవారం కబ్జాకు గురైన గ్రామాభివృద్ధి కమిటీ కొనుగోలు చేసిన స్థలాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాములు సర్పంచుగా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శెనిశెట్టి వెంకటేశం ఆధ్వర్యంలో ప్రజల నుండి డబ్బులు జమ చేసి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి 1019సర్వే నంబర్ లో 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పుడు అట్టి స్థలంలో ఇతర వ్యక్తులు కడీలు పాతి కబ్జా చేయాలని చూస్తున్నారని, గ్రామ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ అఖిలపక్ష నాయకులకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఈ విషయంలో గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి స్థలాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రం, మహేందర్ రెడ్డి, వేణు, ప్రభాకర్, శ్రీనివాస రెడ్డి, రవి, సాయిలు, వెంకట్ గౌడ్, సత్తయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.