– అడ్డుకుంటామన్న కోమటిరెడ్డి బ్రదర్స్
నవతెలంగాణ – భువనగిరి
కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని, దాన్ని వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో నల్లగొండ సభ మంగళవారం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. . నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా ప్రజలు నష్టపోతారని, జంటనగరాలకు తాగునీటి ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి సిద్ధమయింది. నీటిలో వాటా కోసం తో పాటు ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు, పార్టీ ఉనికీ నీ మరింత పెంచి ఈ సభ ద్వారా కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలని ప్రణాళిక రూపొందించింది. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున జన సమీకరణకు కృషి చేస్తున్నారు. మా నీళ్లు మాకేనని పోరు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాటల హోరు ఈ సభ ద్వారా మరోసారి ప్రజలకు వినిపించడానికి వారిలో ప్రత్యేక తెలంగాణ స్ఫూర్తి అభివృద్ధి పేరుతో తీసుకరావడానికి బిఆర్ఎస్ కృషి చేస్తుంది. మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి తోపాటు టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే లందరూ ఏకతాటిపైకి వచ్చి సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తిరిగి నింపి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చూస్తున్నారు . నాయకులంతా సభ వేదిక ప్రజా సమీకరణ పై దృష్టిపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత ఏర్పాటు చేయనున్న పెద్ద బహిరంగ సభ ఇది. దీని ద్వారా పక్కకు మరోసారి బిఆర్ఎస్ యొక్క ప్రజాబలాన్ని చూపెట్టాలని చూస్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెండు స్థానాలను కైవసం చేసుకోవడానికి నీటి ఉద్యమాన్ని ఎంచుకుంది.
అడ్డుకుంటాం కోమటిరెడ్డి బ్రదర్స్: పది సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రములో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని నల్గొండ జిల్లానాగార్జునసాగర్ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయే విధంగా ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల పట్ల అలసత్వం ప్రకటించిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిధులు కేటాయించడంలో విఫలమైనారని అందుకే జిల్లాలో బిఆర్ఎస్కు ప్రజలు ఓట్లు వేయలేదు అన్నారు. ఆదివారం నల్గొండ కేంద్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బిఆర్ఎస్ నల్గొండ సభ పై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని నల్గొండకు వస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు . సభలు అడ్డుకుంటామని, దిష్టిబొమ్మలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరులో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తీరని అన్యాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ సభను బహిష్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య విమర్శలకు సభ వేదిక కానున్నది.