కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం

నవతెలంగాణ- దుబ్బాక రూరల్: దుబ్బాక నియోజకవర్గంలో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని వచ్చే ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి కి భారీ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టనున్నారని బీఆర్ఎస్ పార్టీ అక్బర్ పేట భూంప ల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, దుబ్బాక పీఏసిఎస్ ఛైర్మెన్ షేర్ల కైలాసం, ఎఏంసి చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ పార్టీ నాయకులు  పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని తాళ్లపల్లి, పోత రెడ్డి పేట, నగరం గ్రామాల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తోనే అన్ని గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీల డిపాజిట్ గల్లంతవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ర్యాకం శ్రీరాములు, మంద చంద్రసాగర్, పేరుడి దయాకర్ రెడ్డి, పోతనక రాజయ్య, పుట్ల గారి శంకర్, ప్రశాంత్ గౌడ్, టేకుల పల్లి మల్లారెడ్డి, పన్యాల వెంకటరెడ్డి, బండమీది మల్లయ్య, జీడిపల్లి సురేష్, దేవరాజు, ప్రశాంత్ గౌడ్, తదితరులున్నారు.